ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి
గాంధీనగర్ లో చెంచుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన
మండలంలో కోటి 8 లక్షల నిధులతో పాఠశాల అభివృద్ధి శంకుస్తాపన
ఐదో విడత పల్లె ప్రగతి లో సమాధానం
స్పాట్ వాయిస్, గణపురం: సామాజిక సేవ చేస్తూ పేదలకు అండగా నిలుస్తున్న ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని గాంధీనగర్ గ్రామంలో నిరుపేద చెంచులకు ఉచితంగా చేపడుతున్న 23 ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాకు చెందిన ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దుర్భర జీవితాన్ని గడుపుతున్న చెంచుల జీవితాల్లో వెలుగునింపి, వారి అభివృద్ధికి కృషి చేస్తుందని కొనియాడారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు కృషి..
ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, బడి ఈడు పిల్లలను తప్పకుండా పాఠశాలల్లో చేర్పించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. మంగళవారం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో సుమారుగా కోటి 8 లక్షల నిధులతో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాఠశాల అభివృద్ధి కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన ఊరు-మన బడి కార్యక్రమంలో మండలంలోని గణపురం, కొండాపూర్, అప్పయ్యపల్లె ప్రాథమిక ,ఉన్నత పాఠశాలలో రూ.1.8 కోట్లతో అభి వృద్ధి పనులు కోసం ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు. పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని ప్రజలకు సూచించారు.
పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి..
పల్లె ప్రగతి కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో జరుగుతున్న ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాలలో శ్రమదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధి అద్భుతంగా జరుగుతుందన్నారు. మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments