Friday, March 7, 2025
Homeక్రైమ్పోలీస్ స్టేషన్‌లో మందు పార్టీ..!

పోలీస్ స్టేషన్‌లో మందు పార్టీ..!

పోలీస్ స్టేషన్‌లో మందు పార్టీ..!
పెద్దవంగర పోలీస్ స్టేషన్లో ఘటన
మద్యం తాగే ఫొటోలు వైరల్..
సీరియస్ గా తీసుకున్న పోలీస్ బాస్
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, మరో ఇద్దరితో కలిసి మందు పార్టీ చేసుకోవడం వివాదాస్పదమైంది. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు గురువారం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పెద్ద వంగర పోలీస్ స్టేషన్ అధికారుల తీరుపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు స్టేషన్‌ను మద్యం తాగడం, డ్యూటీ సమయంలోనే మత్తులో తూగారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, పోలీసులు తమ హద్దులు దాటకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ విచారణ జరిపి సదరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈసంఘటనను సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments