ముగ్గురు సెక్స్ వర్కర్లు.. ముగ్గురు విటుల అరెస్ట్..
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: నర్సంపేట పట్టణంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ముఠా పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణం పరిధిలోని మాదన్నపేట రోడ్డులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు గురువారం టాస్క్ ఫోర్స్, పోలీస్ ఆధ్వర్యంలో దాడి చేశారు. ముగ్గురు సెక్స్ వర్కర్లను, ముగ్గురు విటులను, 1000 కండోమ్ ప్యాకెట్స్, హెచ్ఐవీ కిట్స్, ఐదు సెల్ ఫోన్లు, రూ.2వేలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న కిన్నెరపు రమ, విటులు కొయ్యాల రమేష్, కొయ్యల నితిన్, కేశనపల్లి విక్రమ్ అరెస్ట్ చేసి నర్సంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్, పోలీసులు ఎస్సై అరుణ్ గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Recent Comments