మంత్రులు కనికరించలేదా..?
అమాత్యుల పర్యటనలో అమానవీయ ఘటన
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లాలో శుక్రవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క పర్యటించారు. మంత్రులొచ్చారని భారీ ర్యాలీ సైతం తీశారు. అయితే ఇదే రోజు.. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్యక్ష్యం వల్ల పసిబిడ్డ చనిపోయింది. తమకు న్యాయం చేయాలని బాధితు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ర్యాలీగా వెళ్తున్న మంత్రులకు బాహుబలి మూవీ తరహాలో పసికందు మృతదేహాన్ని ఎత్తి చూపించినా.. మంత్రులు కనీసం ఏమైందని పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్డు మీద ఆందోళన చేస్తున్న వారిని మంత్రుల ర్యాలీ కోసం పోలీసులు పక్కకు లాగేశారు. ప్రస్తుతం ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మంత్రుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా జరిగిందా..!
RELATED ARTICLES
Recent Comments