అంగన్‌వాడీ టీచర్ దారుణ హత్య
ములుగు జిల్లాలో ఘటన
స్పాట్ వాయిస్, క్రైమ్: ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో అంగన్‌వాడీ టీచర్ దారుణ హత్యకు గురైంది. మండలంలోని కాటాపురం గ్రామానికి చెందిన సుజాత అంగన్‌వాడీ టీచర్ విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం తాడ్వాయి సమీపంలో అటవీ ప్రాంతంలో సుజాత మృతదేహాం కనిపించగా కూలీలు పోలీసులకు సమాచారం అందజేశారు. సుజాత మెడకు గట్టిగా స్కార్ఫ్‌తో చుట్టి ఉరేసినట్లు కనిపిస్తోంది. ఆమె ఒంటిపై ఉన్న 4 తులాల బంగారం, సెల్‌ఫోన్ దుండగులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
Recent Comments