Sunday, April 6, 2025
Homeజిల్లా వార్తలుపసిగుడ్డును పీక్కుతున్న కుక్కలు

పసిగుడ్డును పీక్కుతున్న కుక్కలు

ఎంజీఎంలో దారుణం..
స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ ఎంజీఎంలో దారుణం చోటు చేసుకుంది. నవజాత శిశువును కుక్కలు పట్టుకొచ్చి పీకుతున్నాయి. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు రోగి బంధువులు వాటిని చెదరగొట్టారు. మృత శిశువును ఎంజీఎం మార్చూరులో భద్రపరిచారు. విషయం తెలిసుకున్న వరంగల్ నగర ఏసీపీ నందిరాం నాయక్, ఎంజీఎం అధికారులు సంఘటన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మృత శిశువు ఆడన, మగన అనేది తెలియ రావడం లేదు. కుక్కలు సగం తినివేయడంతో గుర్తుపట్టడం కష్టంగా మారింది. దీంతో పాటు ఘటన ఎంజీఎం పిల్లల వార్డులో జరిగిందా లేక.. బయట నుంచి ఈ శిశువును తీసుకువచ్చాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments