పెండ్లింట విషాదం..
విద్యుత్ షాక్‌తో నవ వరుడు మృతి..
వధువుకు తీవ్ర అస్వస్థత
స్పాట్ వాయిస్, మహబూబాబాద్:
మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో విద్యుత్ షాక్‌తో నవ వరుడు మృతిచెందగా.., వధువు తీవ్ర అస్వస్థతకు గురైంది. కోడిపుంజుల తండా వాసి ఇస్లావత్ నరేశ్‌కు, విజయవాడకు చెందిన జాహ్నవితో ఈనెల 18న విజయవాడలో వివాహం జరిగింది. నూతన జంట వరుడి స్వగ్రామానికి చేరుకున్నారు. మంగళవారం రిసెప్షన్ జరగాల్సి ఉo డగా.. ఉదయం ఇంట్లోని బోరు మోటరు కోసం విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా నరేశ్‌కు షాక్ తగిలింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందారు. జాహ్నవి కూడా అస్వస్థతకు గురయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పెండ్లి వేడుక సందర్భంగా బంధుమిత్రులు, కుటుంబ సభ్యులంతా ఆనందోత్సాహాలతో ఉన్నసమయంలో ఈ ఘటన చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Recent Comments