గొంతులో ఇరుక్కున్న మటన్ ముక్క
దవాఖానకు తరలిస్తుండగా వృద్ధుడు మృతి
స్పాట్ వాయిస్, మరిపెడ : గొంతులో మటన్ ముక్క ఇరుక్కొని అస్వస్థతకు గురై వృద్ధుడు మృతిచెందిన ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తతండాలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట శివారు డీసీ తండాకు చెందిన జాటోత్ లక్ష్మణ్(68) కొత్త తండాలో దుర్గా మాత పండుగ కోసం బంధువుల ఇంటికి వచ్చాడు. భోజనం చేసే క్రమంలో ఎముక ముక్క గొంతులో ఇరుక్కోవడంతో హుటాహుటిన ప్రభుత్వ దవాఖానకు తరలిస్తున్న సమయంలో మృతిచెందాడు. లక్ష్మణ్ మృతితో డీసీ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Recent Comments