Saturday, April 5, 2025
Homeజిల్లా వార్తలుమద్యం మత్తులో సీఐ కొడుకు వీరంగం..

మద్యం మత్తులో సీఐ కొడుకు వీరంగం..

మద్యం మత్తులో సీఐ కొడుకు వీరంగం..

   స్పాట్ వాయిస్ , కాజీపేట: పబ్లిక్ ప్లేస్ లో మూత్రం పోయవద్దని చెప్పినందుకు మిత్రులతో కలిసి క్యాబ్ డ్రైవర్ పై సీఐ కొడుకు దాడి చేసిన   ఘటన కాజీపేట బస్టాండ్ వద్ద  చోటు చేసుకుంది. దెబ్బలకు  తట్టుకోలేక పక్కనే ఉన్న బస్టాండ్ లోకి డ్రైవర్ పరిగెత్తగా… వెంటపడి మరీ సీఐ కొడుకు అతడి మిత్రులు దాడి చేశారు. అడ్డు వచ్చిన వారిని జేబులలోని పాకెట్ నైఫ్ లతో బెదిరించినట్లు సమాచారం. చేతికి ఉన్న కడియంతో తలపై గుద్దడంతో డ్రైవర్ తల పగిలి తీవ్ర రక్తస్రావం అయింది. 108 లో తోటి డ్రైవర్లు ఆసుపత్రికి తరలించారు.

పోలీసులతో వాగ్వాదం..

పక్కన నిలిపి ఉంచిన 3 కార్ల పై గుద్దడంతో అద్దాలకు పగుళ్లు వచ్చాయి. స్టేషన్ కి తరలించిన పోలీసులతోనూ వాగ్వాదం దిగినట్లు సమాచారం. నా తండ్రి సిద్దిపేటలో సీఐ నన్ను ఎవరూ ఏమీ చేయలేరంటూ డ్రైవర్ లను బూతులు తిట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. సీఐ కొడుకుతో పాటు దాడిలో మరో 6 గురు యువకులు ఒక యువతి ఉన్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం 4గంటలకు కాజీపేట చౌరస్తాలోని హైదరాబాద్ బస్టాండ్ వద్ద జరిగిన ఘటన ఘటనపై కాజీపేట పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments