Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుబతికుండగానే చంపేశారు..

బతికుండగానే చంపేశారు..

అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లే..
కలెక్టరేట్ పై బ్యానర్ కట్టిన యువకుడు
పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం..
పోలీసులు చాకచాక్యంతో తప్పిన ప్రమాదం..
జనగామ కలెక్టరేట్ లో ఉద్రిక్తత..
గతంలోనూ ఒంటిపై కిరోసిన్ పోసుకున్న బాధితుడు
స్పాట్ వాయిస్, జనగామ: బతికుండగానే చంపేశారని.. భూ బాధితుడు ఆత్మహత్యకు యత్నించాడు. గతంలోనూ ఇదే సమస్యపై రెండు సార్లు ఒంటిపై నిప్పంటిచుకున్నా.. నేటికీ న్యాయం జరగలేదు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగరావు, అదే గ్రామానికి చెందిన నిమ్మల లక్ష్మయ్యకు వంశపారంపర్యంగా నర్సింగరావుకు (7.29 గుంటలు), లక్ష్మయ్య కు(7.20 గుంటల) భూమి ఉంది. అయితే నర్సింగరావు బతుకుదెరువు కోసం ములుగు జిల్లాలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. లక్షయ్య , సిరిపురం గ్రామం, లింగాల ఘనపూర్ మండలానికి ఇల్లారికం వెళ్ళాడు. వీరిద్దరికి చెందిన భూమి వారి పాలోళ్లు అయిన నిమ్మల యాదగిరి, నిమ్మల నర్సయ్య , నిమ్మల ఎల్లయ్య, నిమ్మల పాండు ఆక్రమించారు. 2009 లో కొంత భూమి, 2016-17 లో మిగిలిన భూమి అక్రమంగా వారిపేరుపైనా రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. భూ యజమానులమైన తాము బతికి ఉన్నప్పటికీ చనిపోయారంటూ తమ భూమిని ఇతరులకు పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గతంలో పలు సార్లు తహసీల్దార్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఎవరు పట్టించుకోలేదు. దీంతో సోమవారం మరోసారి జనగామ కలెక్టర్ కి గ్రీవెన్స్ సెల్ లో దరఖాస్తు ఇవ్వగా, కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అధికారులు లేకపోవడంతో భూ సమస్య పరిష్కారం కావడం లేదని పిటిషన్ తీసుకోలేదు. దీంతో ఆవేదనకు గురైన బాధితుడు జనగామ కలెక్టరేట్ పైన బ్యానర్ కట్టి, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించి పోలీసులు పైకి ఎక్కి పట్టుకొని హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఇదే విషయంలో బాధితుడు 2021 డిసెంబర్ 20 రోజున జనగామ పాత కలెక్టరేట్ ఎదుట డీజిల్ ఒంటిపై పోసుకున్నాడు. అలాగే 2022 సెప్టెంబర్ 19 రోజున జనగామ నూతన కలెక్టరేట్ ముందు డీజిల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments