బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న దంపతులు
అరెస్టు చేసిన పోలీసులు
స్పాట్ వాయిస్, వరంగల్: ఆర్టీసీ బస్సు ప్రయాణికులే లక్ష్యంగా చోరీలకు పాల్పడతున్న భార్య భర్తలను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు 8. 50 లక్షల విలువ గల 100 గ్రాముల 5మిల్లీ గ్రాముల బంగారు అభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన దంపతులు ములుగు జిల్లా తాడ్వాయి మండలం, కాటారం గ్రామం. ప్రస్తుతం హనుమకొండ కుమార్ పల్లిలో నివాసం ఉoటున్న చెల్ల స్వప్న (27), మద్దూరి సత్యనారయణ (38)గా గుర్తించారు. ఈ అరెస్టుకు సంబంధించి హనుమకొండ ఏసీపీ వివరాలను వెల్లడిoచారు.
Recent Comments