స్పాట్ వాయిస్, దామెర: వెంకటాపూర్, పులుకుర్తి గ్రామ శివారులోని వ్యవసాయ భూముల్లోని సుమారు 11 మంది రైతులకు చెందిన వ్యవసాయ బావులకు ఉన్న కరెంటు మోటార్ వైర్లు కట్ చేసి గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. నిందితులను గుర్తించడానికి పరకాల ఏసీపీ సతీష్ బాబు సూచనల మేరకు శాయంపేట సీఐ రంజిత్ రావు సలహాతో దామెర ఎస్సై కొంక అశోక్ పోలీస్ సిబ్బంది తో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో నిందితులు మహబూబాబాద్ జిల్లా గూడురు మండలానికి చెందిన లకావత్ రాజు @ హరిలాల్ (30), పెద్ద వంగరకు చెందిన లునావత్ మోది లాల్ (32), లునావత్ చందు (28)ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
కరెంటు మోటార్ల వైర్లు కట్ చేసిన నిందితుల అరెస్ట్
RELATED ARTICLES
Recent Comments