మాయమాటలు చెప్పి అపంహరించిన మహిళ
స్పాట్ వాయిస్, నర్సంపేట: ఆస్పత్రిలో బంధువులను చూడడానికి వచ్చిన వృద్దురాలి ఆభరణాలను మరో మహిళా చోరీ చేసిన ఘటన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలం ముగ్ధంపురం గ్రామానికి చెందిన పెండ్యాల లచ్చమ్మ బంధువులు ప్రభుత్వ జిల్లా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిని చూడడానికి లచ్చమ్మ సోమవారం ఆసుపత్రికి చేరుకుంది. మంగళవారం ఉదయం ఓ మహిళ వృద్ధురాలు వద్దకు వచ్చి పక్కనే ఉన్న ఆఫీసులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి డబ్బులు ఇస్తున్నారంటూ మాయమాటలు చెప్పి బయటకు తీసుకు వెళ్లింది. అస్పత్రి పక్కనున్న గల్లీలోకి వెళ్లిన అనంతరం ఒంటిపై ఆభరణాలు ఉంటే డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి వృద్ధురాలు వంటి పైన ఉన్న అర్దతులం బంగారు చెవి కమ్మలు, ఆరు తులాల ముంజెతి వెండి కడియాలు తీయమని చెప్పింది. అందుకు వృద్ధురాలు ఒప్పుకోక పోవడంతో బలవంతంగా అభరణాలు తీయించి అనంతరం వాటిని తన దగ్గర ఉన్న సంచిలో పెట్టుకొని మహిళా ఉడాయించింది. ఆభరణాలు తీసుకున్న మహిళ పారిపోవడం గమనించిన వృద్ధురాలు వెంటనే ఆసుపత్రిలోని బంధువుల వద్దకు వచ్చి విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న బంధువులు అక్కడకు వెళ్లి పరిశీలించగా అప్పటికే మహిళ వెళ్లిపోయింది. విషయం ఆస్పత్రి సూపరింటెండెంట్ గోపాల్ కు తెలపగా సిబ్బంది సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధురాలి ఆభరణాలు చోరీ
RELATED ARTICLES
Recent Comments