Tuesday, November 12, 2024
Homeటాప్ స్టోరీస్పాత పెన్షన్ కోసం కేయూలో వక్ర మార్గాలు

పాత పెన్షన్ కోసం కేయూలో వక్ర మార్గాలు

 అక్రమంగా పాత పెన్షన్ విధానం పొందే ప్రయత్నం
ఈసీ మెంబర్లకు తప్పుడు సమాచారం..
ప్రిన్సిపల్ సెక్రటరీ, వీసీని తప్పుదోవ పట్టిస్తున్న రిజిస్ట్రార్ మల్లారెడ్డి
అక్రమంగా పాత పెన్షన్ విధానం పొందేందుకు ఏర్పాట్లు షురూ
ఇదీ ప్రొఫెసర్ల నిర్వాకం
వీసీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి కొందరు ఫిర్యాదు..
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: కాకతీయ విశ్వవిద్యాలయం అధికారులు ప్రభుత్వ విద్యా శాఖ అధికారులను తప్పుదోవ పట్టించేలా అక్రమంగా కొందరికే పాత పెన్షన్ విధానం అమలయ్యే చర్యలకు పూనుకున్నారు. ప్రొఫెసర్ మల్లిఖార్జున రెడ్డి, ప్రొఫెసర్ ఐలయ్యతో పాటు ఇంకా ఇద్దరు ప్రొఫెసర్లు తమ పాత సర్వీసును కలుపుకొని పాత పెన్షన్ విధానం అమలయ్యే విధంగా ప్లాన్ చేసి అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి పాత సర్వీసును కలిపేసుకుని ప్రభుత్వం దగ్గరి నుంచి 2010 లో జీవో తెచ్చుకొని ప్రభుత్వాన్ని మోసం చేశారని వీసీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి కొందరు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం ఉన్న సెలెక్షన్ కమిటీ ద్వారా నియామకం కానటువంటి అడ హక్ సర్వీసును ప్రస్తుత రెగ్యులర్ సర్వీసుతో కలిపి పాత పెన్షన్ అమలు చేసుకునే వీరి చర్యలకు తెర పడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

2010 జీవో 2024 లో అమలు ఎలా?
2010 లో ప్రభుత్వాన్ని మోసం చేసి కొందరు ప్రొఫెసర్లు తెచ్చుకున్న జీవో 2024 వరకు కాకతీయ యూనివర్సిటీ ఎందుకు అమలు చేయలేదనేది ప్రశ్నార్థకం. ఈ జీవో పైన గతంలో కొందరు లోకాయుక్తాను ఆశ్రయించినట్లు కూడా తెలిసింది. సెలెక్షన్ కమిటీ లో అప్రూవల్ కానీ నియామకాన్ని సర్వీసులో కల్పుకోవడానికి అక్రమ మార్గాలను పాల్పడిన ప్రొఫెసర్ల గురించి ఫిర్యాదు రావడంతో 2010 నుండి ఇప్పటి వరకు ఉన్న కేయూ వైస్ ఛాన్సలర్ లు ఈ జీవో ను పక్కన పెట్టారు. ప్రొఫెసర్ వెంకట రత్నం, ప్రొఫెసర్ సాయిలు, ఇంకా ఇతర వైస్ ఛాన్సలర్ల ఎవరు అమలు చేయని జీవో ప్రస్తుతం అమలు కోసం రావడంతో వివాదాస్పదమైంది. దీని వెనుక ఎవరెవరి పాత్ర ఉందో కూడా విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఇటీవల ప్రొఫెసర్ రమేష్ వీసీ గా ఉన్నప్పుడు కూడా అక్రమంగా ఉత్తర్వులు తీసుకుందామనే ఈ ప్రొఫెసర్ల ఆలోచనకు తెర పడింది. రమేష్ వీసీగా ఉన్న కాలంలో కొందరు పాలక మండలి సభ్యులు వ్యతిరేకించడంతో ఈసీ లో డిఫర్ చేసి ప్రభుత్వానికి ఫైల్ పంపారు.

గత ఈసీ నిర్ణయాన్ని దాచిపెట్టి…
2021-24 మధ్యలో జరిగిన పాలక మండలి సమావేశంలో వీరి విషయాన్ని ఆమోదించలేదు సరికదా నిర్ణయం కోసం ఫైల్ ను ప్రభుత్వానికి పంపారు. అది పెండింగ్ లో ఉండగా ఆ విషయాన్ని దాచిపెట్టి బై సర్క్యులేషన్ ద్వారా కేవలం దొంగ దారిన తెచ్చుకున్న ప్రభుత్వ జీవో పెట్టి ప్రమోషన్ బెనిఫిట్స్, పాత పెన్షన్ విధానం అమలయ్యేట్టు రిజిస్ట్రార్ మల్లారెడ్డి తో మాట్లాడుకొని ప్రస్తుత పాలక మండలి అనుమతి కోసం పంపించినట్లు సమాచారం. వీసీ వాకాటి కరుణను, ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, మిగతా ఈసీ మెంబర్లకు తప్పుదారి పట్టిస్తున్నదేవరో విచారణ చేయాలని ఫిర్యాదులో కోరినట్లు సమాచారం.

ఇదీ ప్రొఫెసర్ల నిర్వాకం…
సమాజానికి మార్గ దర్శనం చేస్తూ విద్యార్థులకు మంచి చెడు చెప్పాల్సిన ప్రొఫెసర్లు ఇలా అక్రమ విధానాలకు పాల్పడడం సిగ్గు చేటని, ఒక వైపు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ, వీసీ, ప్రిన్సిపాల్ సెక్రటరీ లను తప్పు దారి పట్టిస్తూ ప్రొఫెసర్లు చేసే చర్యలపై యావత్ సమాజం సిగ్గు పడుతుందని వీరి ఉత్తర్వులను నిలుపుదల చేసి వీరిపై వెంటనే చర్లలకు పాల్పడాలని ఫిర్యాదులో కోరినట్లు సమాచారం. గతంలో కూడా ప్రొఫెసర్ వెంకట్ రాం రెడ్డి, ఇతరులు కూడా ఇలాంటి జీవో తెచ్చుకొని వారి ప్రమోషన్ బెనిఫిట్స్ ను పొందేలా ప్రయత్నాలు చేశారని దీనిపై లోకాయుక్త లో కేసు కూడా నమోదు అయినట్లు సమాచారం. వీరి ప్రమోషన్ బెనిఫిట్స్ కూడా రికవరీ చేయాలని ప్రభుత్వం ఆదేశించాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments