Saturday, April 5, 2025
Homeరాజకీయంగురువుల అక్రమ మార్గం..

గురువుల అక్రమ మార్గం..

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రిన్సిపాల్, లెక్చరర్
స్పాట్ వాయిస్, నర్మెట్ట: విద్యాబుద్ధులు నేర్పే గురువే ఆక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. బిల్లలు చెల్లింపు కోసం లంచం డిమాండ్ చేసి ఏసీబీకి రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ అనురాధ, లెక్చరర్ మల్లేష్ అటెండర్‌ రేణుక వద్ద రూ. 18వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వేతనాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో వాటి చెల్లింపునకు బాధితురాలి నుంచి డబ్బులు డిమాండ్‌ చేశారు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం పాఠశాలలో ప్రిన్సిపాల్‌, లెక్చరర్‌కు ఆమె డబ్బులు ఇస్తుండగా.. పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments