Saturday, November 23, 2024
Homeకెరీర్ఫొటో లేకపోతే అటెస్టేషన్‌ తప్పనిసరి

ఫొటో లేకపోతే అటెస్టేషన్‌ తప్పనిసరి

టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : టెట్‌ హాల్‌ టికెట్లపై సంతకం, ఫొటో లేకుంటే అభ్యర్థులు టెన్షన్ పడొద్దని టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి సూచించారు. ఫొటో, సంతకం సరిగా లేకపోయినా, అసలు లేకపోయినా ఆందోళన చెందవద్దని, ఇటీవలే తీయించుకున్న ఫొటోను హాల్ టికెట్ పై అతికించి గెజిటెడ్‌ అధికారిచే అటెస్టేషన్‌ చేయించుకోవాలని ఆమె సూచించారు. ఆ తర్వాత ఆధార్‌ లేదా ఇతర గుర్తింపు కార్డుతో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)ను సంప్రదిస్తే, ఆ అధికారి పరిశీలన అనంతరం అభ్యర్థులను పరీక్షకు అనుమతిస్తామని రాధా రెడ్డి స్పష్టం చేశారు. ఇక అభ్యర్థుల పేరులో అక్షరదోషాలు, తల్లి, తండ్రి, పేరు, పుట్టిన తేదీ, కులం, పీహెచ్‌సీ తదితర వివరాలను సరిగా లేకుంటే ఎగ్జామ్‌ సెంటర్‌లో నామినల్‌రోల్‌ కమ్‌ ఫొటో ఐడెంటిటీలో వాటిని సరిచేసుకోవచ్చని ఆమె సూచించారు.

సకాలంలో సెంటర్ వద్దకు చేరుకోవాలి
12న జరిగే టెట్ ఎగ్జామ్‌కు అభ్యర్థులు సకాలంలో సెంటర్ కు చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించమని రాధారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం 9.30 గంట‌ల‌కు, మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ కు అనుమతించమన్నారు. అభ్యర్థులు సెంటర్లకు చేరుకోవాలని, కనీసం గంట ముందే చేరుకోవాలని సూచించారు. టెట్ పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ప్రశ్నపత్రాలను జిల్లాలకు చేరవేస్తున్నామని రాధారెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments