ఎమ్మెల్యే హరీశ్ రావు..
స్పాట్ వాయిస్, బ్యూరో: ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేసి చూపించాలని.. చేస్తే తాను పదవికి రాజీనామాకు చేసేందుకు సిద్ధమని.. లేకపోతే రాజీనామాకు సిద్ధమా? అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది ముఖ్యమంత్రేనన్నారు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది మీరేనంటూ విమర్శించారు. నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాదన్నారు. తనకు పదవి ముఖ్యం కాదని, తన పదవి పోయినా ప్రజలకు న్యాయం జరిగితే అదే సంతోషమని అన్నారు హరీష్ రావు.తన ఛాలెంజ్ స్వీకరించి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేస్తే చాలన్నారు. కేవలం రైతు రుణమాఫీపైనే తాను మాట్లాడలేదని, హామీలన్నీ అమలు చేస్తేనే రాజీనామా అని చెప్పానని గుర్తు చేశారు. ఆగస్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు (అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేసి చూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని.. లేకపోతే రాజీనామాకు సిద్ధమా? అంటూ రేవంత్‌రెడ్డిని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హరీశ్‌రావు ప్రశ్నించారు
Recent Comments