Thursday, April 17, 2025
Homeజిల్లా వార్తలునాకు చదువు రావడం లేదు..

నాకు చదువు రావడం లేదు..

నేను వెళ్లిపోతున్నా..
శవం కూడా దొరకదు.. యువతి లెటర్
ఉమ్మడి వరంగల్ లో కలకలం
స్పాట్ వాయిస్, మంగపేట : చదువు నావల్ల కావడంలేదు. నాకు చదువు రావడం లేదు. చనిపోవాలని అనిపిస్తోంది. నేను మీకు సమస్యగా ఉండొద్దని వెళ్లి పోతున్నా. దూరంగా వెళ్లి చనిపోతున్నా. నా శవం కూడా దొరకదు’ అంటూ డిగ్రీ చదువుతున్న యువతి తల్లిదండ్రులకు లేఖ రాసి అదృశ్యమైంది. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం బోరునర్సాపురంలో చోటు చేసుకుంది. ఎస్సై తాహెర్‌బాబా తెలిపిన వివరాల ప్రకారం.. మంగపేట మండలం బోరునర్సాపురం గ్రామానికి చెందిన జనగాం కృష్ణ రెండో కూతురు కల్యాణి వరంగల్‌లో డిగ్రీ ఫస్టియర్‌ చదువుతోంది. చదువు ఇష్టం లేక నాలుగు నెలలుగా ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులకు లెటర్‌ రాసి ఈనెల 15న ఉదయం 9గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ చదువులు తన వల్ల కావడం లేదు.. నేను వెళ్లిపోతున్నా.. నా శవం కూడా దొరకదు అని ఆ లెటర్‌లో పేర్కొంది. కల్యాణి రాసిన లేఖ చూసి కంగారుపడిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్యాణి ఆచూకీ తెలిస్తే ఎస్సై సెల్‌ 9440795241, రైటర్‌ సెల్‌ 738293503 నంబర్లకు అందించాలని ఎస్సై ప్రజలకు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments