వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్
సోషల్ మీడియాలో ఆడియో వైరల్
WhatsApp Audio 2023-02-17 at 6.30.15 PM
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ వ్యవహార శైలి రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది. బాధ్యత గల అధికారి ’నేను బీఆర్ఎస్ కార్యకర్తను..’ అనడం వివాదాస్పదంగా మారింది. ఆయన మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ పార్టీ కార్యకర్తల వ్యవహరిస్తూ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాడని వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కి శ్రీకాంత్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా గురువారం వర్ధన్నపేట మండలంలో జరిగిన మీటింగ్ కు కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అది జీర్ణించుకోలేక మున్సిల్ చైర్మన్ ఆ ఫ్లెక్సీలు పీకేస్తామనడం ఎంతవరకు సమంజసమన్నారు. ’బీఆర్ఎస్ నాయకులు కూడా కడుతున్నారు.. నేను బీఆర్ఎస్ కార్యకర్తనే..‘ అని అనడం సిగ్గుచేటన్నారు. ఆయన అధికారిలా కాకుండా కార్యకర్తలా వ్యవహరించడం పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కమిషనర్ పై వచ్చిన అవినీతి ఆరోపణలను ఎమ్మెల్యే కప్పి పుచ్చడంపై పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వీరిద్దరి మధ్యలో ఉన్న కమీషన్ల పర్సంటేజీ వివరాలను సైతం బయటికి తీసుకొస్తామని జక్కీ శ్రీకాంత్ స్పష్టం చేశారు.
Recent Comments