అక్రమ నిర్మాణాలపై దూసుకెళ్తున్న బల్డోజర్లు..
స్పాట్ వాయిస్, బ్యూరో: విశ్వనగరంలోని ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తోంది. ఆదివారం నుంచి కూల్చివేతల్లో నిమగ్నమైన హైడ్రా బుల్డోజర్లు సోమవారం ఉదయమే ఆక్రమణలపై దూసుకెళ్తున్నాయి. మాదాపూర్‌లోని కావూరి హిల్స్ పార్కు స్థలంలోని అక్రమ షెడ్లను హైడ్రా కూల్చేసింది. మాదాపూర్‌లోని కావూరిహిల్స్ పార్కు ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. అయితే హైడ్రా ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నదంటూ విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. పెద్దలకు నోటీసులిస్తున్న హైడ్రా అధికారులు.. పేదలకు సంబంధించిన నిర్మాణాలను వారు నిద్ర లేవక ముందే పని మొదలు పెడుతున్నారు. స్పోర్ట్స్అకాడమీ ఏర్పాటు చేశారు. ఈ స్పోర్ట్స్అకాడమీపై కావూరి హిల్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. కావూరి హిల్స్అసోసియేషన్ ఫిర్యాదుతో అక్రమ షెడ్లను కూల్చేశారు. పార్కు స్థలాన్ని 25 ఏళ్లు లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. గడువు తీరకముందే అన్యాయంగా నిర్మాణాలు తొలగించారని ఆరోపించారు.
Recent Comments