Monday, November 25, 2024
Homeక్రైమ్నలుగురి ప్రాణాలు తీసిన కూ.ని ఆపరేషన్

నలుగురి ప్రాణాలు తీసిన కూ.ని ఆపరేషన్

ఇబ్రహీంపట్నం ఘటనలో 4కు చేరిన మృతుల సంఖ్య

మృతుల కుటుంబ సభ్యులకు రూ.5లక్షల పరిహారం

స్పాట్ వాయిస్ , రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి న ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. ఈ ఘటనలో ఆదివారం ఇద్దరు మరణించగా.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ పరిధిలోని సీతారాంపేట్‌కు చెందిన లావణ్య, కొలకులపల్లికి చెందిన మౌనిక కన్నుమూశారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో ఈ నెల 25న 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన విషయం తెలిసిందే.

బాధిత కుటుంబాల ఆందోళన

మృతుల కుటుంబసభ్యులు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments