Sunday, November 24, 2024
Homeక్రైమ్భర్త గొంతు కోసిన భార్య

భర్త గొంతు కోసిన భార్య

హన్మకొండ జిల్లాలో కలకలం..
స్పాట్ వాయిస్, దామెర: హన్మకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దామెర మండలం పసరగొండ గ్రామంలో భర్త గొంతును భార్య కోసింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం… మామిడి శెట్టి రాజు అర్చనకు వివాహమై నేటికి సరిగ్గా నెల రోజులు అవుతోంది. రాజు మల్కపేటలోని ఓ క్రషర్ లో సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం రాజు ఇంట్లో పడుకొని ఉండగా.. అర్చన బ్లేడ్ తో దాడి చేసింది. ఈ ఘటనలో రాజు మెడకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ఎంజీఎం తరలించారు. రాజుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పెళ్లి అయి నెల రోజులకే భర్తపై హత్యకు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments