Sunday, April 6, 2025
Homeక్రైమ్భార్య రొట్టెలు చేయలేదని భర్త ఆత్మహత్య

భార్య రొట్టెలు చేయలేదని భర్త ఆత్మహత్య

స్పాట్ వాయిస్, డెస్క్: భార్య రొట్టెలు చేయలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వినాయకరెడ్డి తెలిపిన ప్రకారం.. బిహార్‌ రాష్ట్రం వైశాలి జిల్లాకు చెందిన మహ్మద్‌ సాబేర్‌ (30) సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో నివాసం ఉంటూ ప్రైవేటు పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. రెండు రోజు క్రితం రాత్రి ఇంటికి వచ్చాడు. సాబేర్‌.. తన భార్యను రొట్టెలు చేయమని అడిగాడు. ఆమె దానికి నిరాకరించడంతో కాసేపు గొడవపడ్డాడు. భర్య మాటవినడం లేదని, అవమానకరంగా భావించిన సాబేర్ మనస్థాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన భార్య స్థానికులను పిలిచి.. వారి సహకారంతో పోలీసులుకు సమాచారం అందజేశారు. సాబేర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments