Wednesday, April 16, 2025
Homeతెలంగాణప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ లా..?

ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ లా..?

ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ లా..?

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిరాకేష్ రెడ్డి

స్పాట్ వాయిస్, ఓరుగల్లు: హన్మకొండ, వరంగల్ లో శుక్రవారం కేటీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఉదయమే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి నివాసానికి పోలీసులు చేరుకున్నారు. రాకేష్ రెడ్డి బయటకు వెళ్లకుండా ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా పోలీసుల తీరు పై రాకేష్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ వస్తే ముందస్తు అరెస్ట్ లు చేసే బదులు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ 144 సెక్షన్ పెడితే అయిపోతుందన్నారు. అభివృద్ధి పనులు చేయటానికి వచ్చే మంత్రిగారు ప్రతిపక్ష నాయకులను ముందస్తు అరెస్టు చేయడానికి ఏంటి సంబంధమని నిలదిశారు. కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ, ఓవర్ హాలింగ్ అండ్ మెయిన్టెనెన్స్ వర్క్ షాపు పై కేటీఆర్ తప్పకుండా స్పందించాలని డిమాండ్ చేశారు. ఓరుగల్లు అనేక సమస్యలతో సతమతమవుతుందని ప్రశ్నిస్తే భయంతోనే ముందస్తుగా అర్థం పర్థం లేని అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments