Saturday, November 23, 2024
Homeలేటెస్ట్ న్యూస్మూసివేసిన హాస్టల్స్ ను తెరువాలి

మూసివేసిన హాస్టల్స్ ను తెరువాలి

వీసీ భవనం ఎదుట కేయూ విద్యార్థుల ఆందోళన
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: కాకతీయ యూనివర్సీటీలో మూసివేసిన పీజీ, పీహెచ్ డీ హాస్టల్స్ ను తక్షణమే రీ ఓపెన్ చేసి, విద్యార్థులందరికీ మెస్ సౌకర్యం కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కాకతీయ యూనివర్సిటీలోని పీజీ, పరిశోధక విద్యార్థులు వీసీ భవనం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొంత కాలంగా కాకాతీయ యూనివర్సీటీలో వీసీ, రిజిస్ట్రార్లు చేసిన తప్పులకు హాస్టల్స్ ముసివేసి పీజీ, పీహెచ్ డీ చదువులకు దూరం చేసి, విద్యార్థుల జీవితాతో చెలగాటం ఆడుతున్నారన్నారు. వారు చేసిన తప్పులను పుచ్చుకోవడానికి హాస్టల్స్ మూసి వేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. యూనివర్సిటీ చరిత్రలో రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్స్ మూసిన దాఖలాలు లేవని, కాని ఇప్పుడు యూనివర్సిటీ అధికారులు కుట్రపూరితంగా మూసివేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయాల అధికారులు స్పందించి రీసెర్చ్ స్కాలర్ హాస్టల్ రూమ్స్ కు వేసిన తాళాలను తొలగించాలని డిమాండ్ చేశారు. పరిశోధక విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పించాలని, పెంచిన పీహెచ్ డీ అడ్మిషన్ ఇతర అన్ని రకాల ఫీజులను తగ్గించాలని, కేయూ పాలకమండలిలోకి పరిశోధక విద్యార్థులను, విద్యార్థి సంఘ నాయకులను భాగస్వామ్యం చేయాలని, ఆంధ్ర ప్రాంత ప్రొఫెసర్ కేయూ రిజిస్ట్రార్ టి. శ్రీనివాసరావును తక్షణమే తొలగించాలన్నారు. కనీస అర్వత లేని హాస్టల్ జేడీ,ఏడీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ రీసెర్చ్ చ్ స్కాలర్స్ అసోసియేషన్ (కుర్సా) అధ్యక్షులు తాళ్లపల్లి నరేష్ గౌడ్, ఎమ్.ఎస్.ఎఫ్. జిల్లా ఇన్చార్జి మంద భాస్కర్, పి. డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావు, ఎంఎస్ఎఫ్ ఇంచార్జి వడ్డేపల్లి మధు, పరిశోధక విద్యార్థులు మాదాసీ రమేష్, గుండేటి సుమన్, సోమ రాజు, విష్ణు, గుండు సురేష్, సాంబయ్య, సంపత్, జానకిరామ్, ఆశీర్వాదం ,విజయ్, ఎలికట్టే సతీష్, రంగు సతీష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments