Thursday, September 19, 2024
Homeజనరల్ న్యూస్ఈ నెల 7, 17న సెలవు

ఈ నెల 7, 17న సెలవు

ఈ నెల 7, 17న సెలవు
హాలీడే ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..
స్పాట్ వాయిస్, బ్యూరో : ఈ నెల 7, 17వ తేదీలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీ గణేశ్ చతుర్థి, సెప్టెంబర్ 17న మిలాద్ ఉన్ నబీకి హాలీడే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తెలంగాణ సాధారణ సెలవుల క్యాలెండర్ ప్రకారం.. 7వ తేదీ గణేశ్ చతుర్థి, సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీకి సెలవుగా డిక్లేర్ చేశారు. అయితే, నెలవంక దర్శనం తేదీని బట్టి మిలాద్ ఉన్ నబీ హాలీ డే డేట్ మారింది. మొదట నిర్ణయించిన 16న కాకుండా.. 17వ తేదీన మిలాద్ ఉన్ నబీ హాలీడే గా ప్రభుత్వం తాజాగా డిక్లేర్ చేసింది. ఈ నెల 7వ తేదీన గణేశ్ వినాయక చవిత ప్రారంభం కానుండగా.. 17న నిమజ్జనం జరగనుంది. 17న వినాయక నిమజ్జనం జరగనుండడంతో అదే తేదీన జరగాల్సిన మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ర్యాలీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 19వ తేదీన మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ర్యాలీ జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments