గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
స్పాట్ వాయిస్, డెస్క్: రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ మహిళా దినోత్సవం సెలవు వర్తిస్తుంది. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. మహిళా ఉద్యోగులకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఈ మేరకు ఆదేశించింది.
ఆడవాళ్లకు హాలీడే..
RELATED ARTICLES
Recent Comments