Sunday, May 25, 2025
Homeతెలంగాణరేపు కూడా విద్యాసంస్థలకు సెలువు

రేపు కూడా విద్యాసంస్థలకు సెలువు

విద్యాశాఖ మంత్రిని ఆదేశించిన సీఎం
స్పాట్ వాయిస్, బ్యూరో: భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం సైతం విద్యాసంస్థలకు సెలువు ప్రకటించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే బుధ, గురువారం సెలువు ఇచ్చిన విషయం తెలిసిందే.

వరద ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ములుగు, భూపాలపల్లితోపాటు నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లో కుండపోతగా వానలు కురిశాయి. దీంతో ఆయా జిల్లాల్లో వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో వదర బాధిత జిల్లాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్‌లను నియమించారు. ములుగు జిల్లా ప్రత్యేకాధికారిగా కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి జిల్లాకు పీ.గౌతమ్‌, నిర్మల్‌ జిల్లాకు ముషారఫ్‌ అలీ, మంచిర్యాల జిల్లా ప్రత్యేక అధికారిగా భారతి హోళికేరిని నియమించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments