Friday, September 20, 2024
Homeక్రైమ్హన్మకొండలో దారుణం..

హన్మకొండలో దారుణం..

హన్మకొండలో దారుణం..

వివాహిత పై సామూహిక లైంగిక‌దాడి..

పోలీసుల అదుపులో నిందితులు..!

స్పాట్ వాయిస్, క్రైమ్:హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. వివాహిత పై ముగ్గురు అత్యాచారానికి పాల్పడారు. హన్మకొండ నయీంనగర్ లో కుటుంబ కలహాల తో వివాహిత శుక్రవారం రాత్రి ఒంటరిగా ప్రధాన రహదారిపైకి నైటీలో చేరుకుంది. కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డు వైపు అర్ధరాత్రి ఒంటరిగా నడుచుకొంటూ వెళ్ళింది. ఈ క్రమంలో భీమారంకు చెందిన ఆటో డ్రైవర్ సదరు వివాహిత ను ట్రాప్ చేశాడు. నయీం నగర్ వద్ద దింపుతానని నమ్మించి, మరో ఇద్దరిని ఫోన్ చేసి రమ్మన్నాడు. భీమారం చెరువు దగ్గరకు తీసుకువెళ్ళి లైంగిక‌దాడికి పాల్పడ్డారు. శనివారం సదరు వివాహిత హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హన్మకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అదుపులో నిందితులు..

లైంగిక‌దాడి ఫిర్యాదు అందుకున్న హన్మకొండ పోలీసులు రంగంలోకి దిగారు. సీఐ శ్రీనివాస్ జీ ఆదేశాల మేరకు సీసీ టివి పుటేజీ ఆధారంగా ఆటో నంబర్ ను గుర్తించారు. ఆటో డ్రైవర్ ను, లైంగిక‌దాడికి పాల్పడిన ఇద్దరిని గుర్తించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments