Saturday, April 5, 2025
Homeతెలంగాణఐలోని మల్లన్నకు పెద్దపట్నం..

ఐలోని మల్లన్నకు పెద్దపట్నం..

ఐలోని మల్లన్నకు పెద్దపట్నం..
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: ఐనవోలు మల్లన్న స్వామి ఆలయానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. సంక్రాతి నుంచి ఉగాది వరకు దాదాపు మూడు నెలలపాటు బ్రహ్మోత్సవాలు జరుగనుండగా… చివరి ఆదివారం కావడంతో భక్తులు స్వామివారి సన్నిధికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి.. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ సమేత మల్లన్న కల్యాణ వేడుకలో పాల్గొన్నారు. ఆదివారం నిర్వహించిన రాష్ట్రంలోనే 40 ఫీట్ల అతిపెద్ద పట్నం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 300 మంది ఒగ్గు పూజారులు తీరొక్క రంగవల్లులతో సుమారు 9గంటలపాటు శ్రమించి పెద్ద పట్నం వేశారు. భక్తులు ఆ పట్నం తొక్కి పులకించిపోయారు. పసుపు బండారి చల్లుకున్నారు. ఈ వేడుకల్లో ఈవో నాగేశ్వరరావు, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ మునిగాల సంపత్ , ఆలయ ఉప ప్రధాన ఆచార్యులు రవీందర్, పండితులు మధుశర్మ, శ్రీనివాస్, సీఐ విశ్వేశ్వర్ , ఎస్సై భరత్, పునరుద్ధరణ కమిటీ డైరెక్టర్లు , తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments