Saturday, September 21, 2024
Homeతెలంగాణచరిత్ర క్షమించదు కేసీఆర్...

చరిత్ర క్షమించదు కేసీఆర్…

ఒక మతం ఓట్ల కోసం తప్పుదోవ పట్టించడం సరికాదు..
రజాకార్ల కంటే కేసీఆరే ప్రమాదకారి..
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి
స్పాట్ వాయిస్, హన్మకొండ: ఎంతో మంది పోరాటాల ఫలితమైన తెలంగాణ విమోచనాన్ని సమైక్యతా దినోత్సవంగా జరుపడం అంటే తెలంగాణ వీరులను అవమాన పరచడమేనని, ఒక మతం ఓట్ల కోసం సమస్త సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తే చరిత్ర క్షమించదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. తెలంగాణకు స్వాతంత్ర్యం సిద్ధించిన రోజున నిజాం అకృత్యాల ఊసెత్తని కేసీఆర్ తీరును నిరసిస్తూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ హసనపర్తి శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దాష్టీకాలకు వ్యతిరేక పోరాటాల ఫలితమే తెలంగాణ విమోచనం అన్నారు. విమోచనం రోజున తెలంగాణ ప్రజలను ఊచకోత కోసిన నిజాం పేరు చెప్పే ధైర్యం లేని కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. ఈ విషయమై తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

8 ఏళ్లు పట్టిందా..?
తెలంగాణ స్వాతంత్ర ఉత్సవాలు అధికారికంగా జరుపుకోడానికి 8 ఏళ్లు పట్టిందా అని రాకేష్ రెడ్డి సీఎంను ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడమే పాపం అయిందని విచారం వ్యక్తం చేశారు. 80 వేల పుస్తకాలు చదివిన మహా మేధావి కేసీఆర్ కు తెలంగాణ చరిత్ర, నిజాం అరాచకాలు కనిపించకపోవడం బాధాకరం అన్నారు. కేవలం తన స్వార్థం కోసం, ఎంఐఎం ఓట్లకోసం నిజాంను పోగుడుతున్న కేసీఆర్ ధోరణిని సమస్త తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. నిజాం ను పొగడడం అంటే తెలంగాణ విమోచన పోరాట వీరులను అవమాన పరచడమే అన్నారు. ఏనిమిదేళ్లుగా లేని ఉత్సవాలు ఇప్పుడు గుర్తుకు రావడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. దేశానికి స్వాతంత్ర వచ్చాక ఏడాది వరకు నిజాం తెలంగాణ త్రివర్ణ పతాకాన్ని ఎగురనివ్వలేదని, తెలంగాణ వచ్చి 8 ఏళ్లవరకు అధికారికంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురనివ్వలేదని ఈ లెక్కన చూస్తూ రజాకార్ల కంటే కూడా కేసీఆరే ప్రమాదకారి అని దుయ్యబట్టారు.


అర్థం తెలియని సన్నాసి..
రజాకార్ల వారసుడు అసుదుద్దీన్ రాసిచ్చిన స్రిప్టు ప్రకారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవం అని ప్రకటించిన కేసీఆర్ కు తెలివి తేటలు అత్యాద్భుతం అని ఎద్దేవా చేశారు. ఆ మాటకొస్తే విమోచనానికి జాతీయ సమైక్యతకు అర్థం తెలియని సన్నాసి కేసీఆర్ అన్నారు. దేశ స్వాతంత్రం కోసం చేసిన త్యాగాలు ఎంతటివో తెలంగాణ ప్రజలు త్యాగాలు కూడా అంత గొప్పవన్నారు. బ్రిటీషు వారి కంటే నిజాం రజాకార్ల సైన్యం చేసిన ఆకృత్యాలు చాలా క్రూరంగా ఉండేవని, తెలంగాణ ఆడబిడ్డలను వివస్త్రను చేసి బతుకమ్మ అడించిన విషయాలను ప్రజలకు చెప్పకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అసలు కేసీఆర్ ఉద్యమకారుడేనా.. లేదంటే పిరికి పందనా తేల్చుకోవాలని సవాల్ విసిరారు.

బీజేపీ మద్దతుతోనే..
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బీజేపీ తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడిందన్నారు. పార్లమెంటు లో ఓటు వేసి తెలంగాణ బిల్లుకు మద్దతు తెలిపి ప్రజల కలను సాకారం చేసిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ విమోచనాన్ని మోది ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ వీరుల పోరాటాలు వారి త్యాగాలను స్మరించుకుంటుందన్నారు. 560కి పైగా సంస్థానాలు విలీన ఒప్పందం చేసుకుని భారతదేశంలో కలిస్తే, కేవలం హైదరాబాద్ మాత్రమే సైనిక చర్య ద్వారా విమోచనం పొందిన దుర్ధినాలను ఎవరూ మరిచిపోరన్నారు. సెప్టెంబరు 17న మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ముక్తి దివస్ గా, కర్నాటక ప్రభుత్వం కర్నాటక ముక్తి విమోచన దినారణ పేరుతో ఉత్సవాలు జరుపుకుంటుంటే తెలంగాణ ఉద్యమ నాయకున్ని అని చెప్పుకునే కేసీఆర్ తెలంగాణ స్వతంత్ర దినోత్సవాన్ని అధికారికంగా జరిపే ధైర్యం లేదన్నారు. అధికారంతో కళ్లు మూసుకుపోతే ప్రగతి భవన్, ఫాం హౌస్ ల నుంచి బయటకు వచ్చి తెలంగాణ కోసం రక్తం చిందించిన వీరుల కన్న నేలలు వీర బైరాన్ పల్లి, పరకాల, అమరధామం, గుండ్రాంపల్లి ని సందర్శించి చరిత్రను తెలుసుకోవాలన్నారు. ఎంఐఎంతో కలిసి తెలంగాణ రజాకార్లకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న కేసీఆర్ కు నిజాం కు పట్టిన గతే పడుతుందన్నారు. కార్యక్రమంలో హసన్ పర్తి కార్పొరేటర్, బీజేపీ సీనియర్ నాయకులు గురుమూర్తి శివ కుమార్, హరి శంకర్, కుమారస్వామి, రామచంద్రా రెడ్డి, గుండమీది శ్రీనివాస్, సంతోష్, రమేష్, సాయి చంద్, కుంబర్కర్ సాయి, పవన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments