Friday, November 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్.. అనుమతి లేకుండా ఆందోళనలా...?

ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్.. అనుమతి లేకుండా ఆందోళనలా…?

అనుమతి లేకుండా ఆందోళనలా…?
స్పాట్ వాయిస్, హైదరాబాద్: అనుమతులు లేకుండా ఆందోళన లు చేయడం ఏంటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ .. టీఆర్ఎస్ ఆందోళన లు చేపడుతోంది. ఇందులో భాగంగా బుధవారం జాతీయ రహదారులపై రాస్తారోకో చేపట్టింది. దీంతో
కాకతీయ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు లో పిటిషన్‌ దాఖలైంది. విచారణ చేపట్టిన హైకోర్టు టీఆర్ఎస్ ఆందోళనలకు అనుమతులు ఉన్నాయా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ధర్మాసనం ప్రశ్నలకు సమాధానమిస్తూ.. రాస్తారోకోలకు అనుమతి ఇవ్వలేదని హోంశాఖ స్పష్టం చేసింది. తమ దృష్టికి వచ్చిన అంశాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని న్యాయస్థానానికి తెలియజేసింది. జిల్లాల్లో టీఆర్ఎస్ ఆందోళనలపై ప్రభుత్వ వివరణను రికార్డు చేసిన హైకోర్టు… పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాలకు అనుమతి ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. అనుమతి లేని ఆందోళనలను అడ్డుకోవాలంటూ ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments