Wednesday, May 21, 2025
Homeతెలంగాణహైకోర్టు సంచలన తీర్పు

హైకోర్టు సంచలన తీర్పు

నలుగురు పోలీసులకు జైలు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నలుగురు పోలీసులకు 4 వారాల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని నలుగురిపై ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని పోలీసులపై అభియోగం నమోదైంది. ఈ కేసులో జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్‌, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై నరేశ్‌కు జైలు శిక్ష విధించింది. నలుగురిపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీపీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పీలుకు వెళ్లేందుకు వారికి శిక్ష అమలును 6 వారాలు నిలిపివేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments