Wednesday, January 29, 2025
Homeతెలంగాణవాళ్ళూ కూలీలేగా..

వాళ్ళూ కూలీలేగా..

వాళ్ళూ కూలీలేగా..

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వండి.. 

మున్సిపాలిటీ ల్లోని కూలీలను లెక్కలోకి తీసుకోoడి..

సీఎస్‌కు హై కోర్టు ఆదేశాలు

స్పాట్ వాయిస్ , బ్యూరో: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. మున్సిపాలిటీ ల్లో ఉన్న రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం డబ్బులు ఇవ్వడం లేదని నారాయణపేట వాసి గవినోళ్ల శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లించేలా పథకం రూపొందించిన ప్రభుత్వం, మున్సిపాలిటీ ల్లో ఉంటున్న రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపారు. 129 పురపాలికల్లో 8 లక్షల మందికి పైగా రైతు కూలీలున్నారని చెప్పారు. రైతు కూలీలు ఎక్కడ ఉన్నా అందరూ సమానమేనని, గ్రామాల్లో వారికే వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం అన్నారు. అనంతరం హైకోర్టు స్పందిస్తూ, నాలుగు వారాల్లో మున్సిపాలిటీల్లోని రైతు కూలీలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలోకి తీసుకోవాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments