అధిక వసూళ్లు నిజమే..!
మీ సేవ సెంటర్లలో అధికారుల తనిఖీ
ఆ మూడు సెంటర్లపై చర్యలకు సిద్ధమా..?
నిజం కానున్న ‘స్పాట్ వాయిస్’ కథనాలు
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: భూపాలపల్లిలోని మీ సేవ సెంటర్ల గుట్టురట్టు అయినట్లు విశ్వసనీయ సమాచారం. అధిక వసూళ్ల చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. కొద్ది రోజులుగా భూపాలపల్లిలోని మూడు మీ సేవ సెంటర్లలో సర్టిఫికెట్లకు నిర్దేశిత రుసుం కంటే ఎక్కువగా వసూల్ చేస్తున్నారని, బర్త్, ఫ్యామీలీ సర్టిఫికెట్లకు వేలల్లో గుంజుతున్నారంటూ కథనాలను ప్రచురితమయ్యాయి. అంతేకాకుండా సింగరేణి ఉద్యోగులకు సదురు మీ సేవ సెంటర్ల నుంచి ఇన్ కం సర్టిఫికెట్లు ఇప్పించడంపై వార్తలు వచ్చాయి. ఇందుకు తహసీల్దార్ కార్యాలయంలోని కొంతమంది సిబ్బంది సైతం సహకరిస్తున్నట్లు తెలిసింది. అయితే స్పాట్ వాయిస్ కథనాలకు స్పందించిన తహసీల్దార్ శ్రీనివాసులు, ఈడీఎం శ్రీకాంత్ మీ సేవ సెంటర్లలో తనిఖీలు చేపట్టారు. సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్ చేసి మరి చెల్లించిన అమౌంట్ పై ఆరా తీశారు. ఈ క్రమంలోనే పలు మీసేవ సెంటర్లలో అధిక వసూళ్లు చేస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీనికి తోడు నిబంధనలకు విరుద్ధంగా ఓ మీ సేవ సెంటర్ నడిపిస్తున్నట్లు తేలినట్లు తెలిసింది. ఈ మేరకు ఆ సెంటర్లపై చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments