Monday, November 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్హయ్యా బాబాయో..

హయ్యా బాబాయో..

వీడు మాములోడు కాదు..
60మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు..
రూ.4 కోట్లకు పైగా వసూలు..
ఇన్ స్టాగ్రామ్ వేదికగా వల
ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన హైటెక్ బాబు
స్పాట్ వాయిస్, క్రైం: నేటి జనరేషన్ సోషల్ మీడియాలోనే మునిగిపోతున్నారు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ట్విటర్.. ఇలా.. సమయం తెలియకుండా గడిపేస్తున్నారు. అయితే ఈ టెక్నాలజీ పెరిగాక పక్కోడిని మోసం చేయడం చాలా ఈజీ అయిపోయింది. ముఖ్యంగా యువత.. ఈజీగా మోసపోతున్నారు. అమ్మాయిలే లక్ష్యంగా కొంత మంది కేటుగాళ్లు… ఫేక్ అకౌంట్స్‌తో వాళ్లను నమ్మించి.. కోట్లలో మోసం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ అడ్డాగా ఓ కేటుగాడు.. ఏకంగా 60 మంది అమ్మాయిలను మోసం చేసి రూ.4 కోట్లకు పైగా లూటీ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ రాజమండ్రికి చెందిన వంశీకృష్ణ బీటెక్ పూర్తి చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. తాను హైప్రొఫైల్‌ వ్యక్తినంటూ.. తప్పుడు సమాచారంతో అమ్మయిలను బోల్తా కొట్టించాడు. 60 మంది యువతులను మోసం చేసి… 4 కోట్ల రూపాయలను దోచుకున్నాడు. లక్షలు మోసపోయిన అమెరికాలో ఉండే హైదరాబాద్‌కు చెందిన ఓ బాధిత యువతి.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఈ హైటెక్ బాబును అరెస్టు చేశారు. వంశీకృష్ణపై గతంలో రాచకొండ, ఉభయ గోదావరి, కాకినాడ, గద్వాల, నిజామాబాద్, ఖమ్మం, భీమవరం, విశాఖపట్నం, కరీంనగర్, విజయవాడలో ఈ తరహా  కేసులు నమోదయ్యాయి.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments