Thursday, November 21, 2024
Homeసినిమాసినీతార మీనా భర్త మృతి..

సినీతార మీనా భర్త మృతి..

స్పాట్ వాయిస్, డెస్క్: ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్‌ (48) మంగళవారం రాత్రి చెన్నైలో మరణించారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్య ఉందని, గత కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్నారని తెలిసింది. జనవరిలో మీనా కుటుంబం మొత్తానికి కరోనా వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆయన ఆరోగ్య సమస్య మరింత తీవ్రమైంది. ఊపిరితిత్తులు మార్పిడి చేయాల్సి ఉండగా.. డోనర్​ లేక వాయిదా పడుతోందని.. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించినట్లు సమాచారం. బుధవారం విద్యాసాగర్​ అంత్యక్రియలు జరగనున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.

ప్రముఖులు సంతాపం

విద్యాసాగర్​ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ విద్యాసాగర్‌ను మీనా 2009లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది. ఇటీవల మీనా.. దృశ్యం 2 సహా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరోవైపు ఆమె కుమార్తె నైనిక కూడా కొన్నాళ్ల క్రితం తళపతి విజయ్​ హీరోగా తెరకెక్కిన ‘థేరీ’ చిత్రంతో అరంగేట్రం చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments