భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
ఎస్సై ప్రశాంత్ బాబు
స్పాట్ వాయిస్ , నల్లబెల్లి: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఎస్సై ప్రశాంత్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అని వాతావరణం శాఖ వారు హెచ్చరికలు జారీ చేయడం జరిగినది. నల్లబెల్లి మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండగలరని, ప్రజలు రైతులు చెట్ల కింద, కరెంటు పోల్స్ కింద, కరెంటు తీగల కింద, నివసించరాదని, పశువులను చెట్ల కింద కరెంటు పోల్స్ కింద కట్టి వేయకూడదు. మరియు వాగులు , వర్రెలు, ఎక్కువ గా ప్రవహించే సమయంలో వాగులు దాటకూడదు.చెరువులు ముత్తడి టైములో ప్రజలు చాపల కోసమని నీటిలోకి దిగకూడదు.శిథిలావస్థలో ఉన్న ఇండ్ల యందు నివసించరాదు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉన్న కుటుంబాలు దగ్గర్లో ఉన్న తెలిసిన వాళ్ళ ఇల్లాయందు గానీ ప్రభుత్వ బాగా భవనాలు, పాఠశాలలు, గ్రామపంచాయతీలు, రైతు వేదికల యందు, ప్రస్తుతం నివాసం ఉండగలరు. అందుబాటులో నివాస స్థలములు లేకుంటే పోలీసువారికి తెలియపరిస్తే పోలీసు వారు మరియు రెవెన్యూ అధికారులు పునరావాసం కల్పించబడును. ప్రజలు నీటితో ఎలాంటి సాహసo చేయకూడదు. వాగులు ఉప్పొంగి ,చెరువు కట్టలు తెగి, మరియు చెట్లు పడిపోయిన,కరెంటు స్తంభాలు కూలిపోయిన, శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలిపోయిన, వెంటనే పోలీసువారికి మరియు అందుబాటులో ఉన్న సంబంధిత అధికారులకు తెలియపరచవలనని అన్నారు.
Recent Comments