Sunday, April 6, 2025
Homeతెలంగాణభద్రాద్రిలో భారీ వర్షం..

భద్రాద్రిలో భారీ వర్షం..

కుంగిన కల్యాణ మండపం..
రామాలయం పడమర మెట్ల వద్దకు చేరిన నీరు
స్పాట్ వాయిస్, బ్యూరో: రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భద్రాచలంలోని రామాలయం పడమర మెట్లవద్దకు వర్షపు నీరు చేరింది. ఆ ప్రాంతంలో సుమారు 35 దుకాణాలకు వరద నీరు చేరడంతో సామగ్రి మొత్తం వర్షపు నీటిలో తడిసిపోయింది. వర్షాలకు భద్రాచలంలోని హరినాథబాబా ఆలయం వద్ద కొండపై ఉన్న కల్యాణమండపం కుంగిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలిస్తున్నారు. కొండ కింద ఉన్న ఇళ్లు, దుకాణాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు రామాలయం వద్ద అన్నదాన సత్రంలోకి వర్షపునీరు చేరింది. దీంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి. పడమరమెట్ల వద్ద వర్షపు నీట వల్ల నిలిచి ప్రయాణాలకు అంతరాయం కలిగింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments