Saturday, April 5, 2025
Homeక్రైమ్బౌలింగ్ చేస్తుండగా.. గుండెపోటు

బౌలింగ్ చేస్తుండగా.. గుండెపోటు

బౌలింగ్ చేస్తుండగా.. గుండెపోటు
సీపీఆర్ చేసినా దక్కని ప్రాణాలు
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నీలో క్రికెట్ ఆడుతుండగా బౌలింగ్ వేస్తూ ప్లేయర్ గుండెపోటుకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన శనిగరం ఆంజనేయులు (37) శుక్రవారం బౌలింగ్ వేసతూ హార్ట్ స్ట్రోక్‌తో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానిక యువకులు గుండెపోటుగా అనుమానంతో సీపీఆర్‌ నిర్వహించినా ఫలితం లేకపోయింది. హుటాహుటినా హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్య సిబ్బంది అతడికి మరోసారి సీపీఆర్‌ చేసినా ప్రయోజనం దక్కలేదు. దీంతో ఆ యువకుడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments