Sunday, November 24, 2024
Homeక్రైమ్ఛీ.. వంకర బుద్ధోడు..

ఛీ.. వంకర బుద్ధోడు..

యువతి ఫొటోలు మార్ఫింగ్ చేశాడు..
పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు..

స్పాట్ వాయిస్, హన్మకొండ క్రైమ్: యువతి ఫొటోలను ఆశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషన్ మీడియా పోస్ట్ చేస్తానంటూ బెదిరిస్తున్న యువకుడిని గీసుగొండ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ కు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ కోట మండలం దూబకుంట గ్రామానికి చెందిన జన్ను విజయకుమార్ కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన యువతితో ఫోన్ ఛాటింగ్ చేస్తున్నాడు. ఈ వ్యవహారం యువతి అక్కకు తెలియడంతో యువకుడిని మందలించింది. దీంతో అక్కపై కక్షగట్టిన నిందితుడు అశ్లీల ఫొటోలతో మార్ఫింగ్ చేసిన బాధితురాలి ఫొటోలను, అసభ్యకరమైన మెసేజ్ లను బాధితురాలి ఫోన్ పంపాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించడంతో బాధితురాలు గీసుగొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం విభాగం సహకారంతో దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ డీసీపీ మాట్లాడుతూ మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుడిని గుర్తించడంతో ప్రతిభ కనబరిచిన గీసుగొండ ఇన్ స్పెక్టర్ సట్ల రాజు, సైబర్ క్రైం ఇన్ స్పెక్టర్ జనార్దన్ రెడ్డి, ఎస్సై వెంకన్న, కానిస్టేబుళ్లు కిషోర్, సంపత్ ను డీసీపీ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments