బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం..
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరిగింది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. సీపీ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని శంషాబాద్ పీఎస్‌కు తరలించారు. అయితే, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని విడుదల చేయడంపై బీఆర్‌ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేశారు. అరెస్టు చేయకపోతే కోర్టు వెళ్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Recent Comments