స్పాట్ వాయిస్, హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఆయన పుట్టిన రోజు కావడంతో.. శుభాకాంక్షలు తెలుపుతూ ఈటలకు కేసీఆర్ లేఖ పంపారు. ఈటలకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని కోరుకున్నట్లు లేఖలో తెలిపారు. అలాగే గవర్నర్ తమిళిసై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు.
Recent Comments