Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలుఘనంగా హనుమాన్ శోభయాత్ర

ఘనంగా హనుమాన్ శోభయాత్ర

ఘనంగా హనుమాన్ శోభయాత్ర
కోలాటాలు, విచిత్ర వేషధారణలు
27వ హనుమాన్ జయంతి వేడుకలు
స్పాట్ వాయిస్ కాజీపేట: కాజీపేట మండలం జూబ్లీ మార్కెట్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో 27వ హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి జాగర్లపూడి శ్రీనివాస్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణ ముఖముగా వెలిసిన అభయాంజనేయ స్వామి 27వ జయంతి వేడుకలు అతి వైభవంగా జరిపిస్తున్నామని తెలిపారు. ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. సోమవారం నుంచి బుధవారం వరకు జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సోమవారం ఉదయం గణపతి పూజ నవగ్రహ మండపారాధన ఉత్సవమూర్తులకు రుద్రాభిషేకం మంత్రపుష్పం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి శోభాయాత్రలో మహిళా కోలాటాలు విచిత్ర వేషధారణ లతో కన్నుల పండుగగా జరుగుతున్న ఈ శోభాయాత్రను భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ శోభయాత్ర లో ప్రభుత్వ చీప్ విప్ ద్యాసం వినయ్ భాస్కర్ ,మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. రాత్రి పదిగంటలకు శోభాయాత్రన ముగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments