స్పాట్ వాయిస్, భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లిలో దారుణం జరిగింది. కన్నకొడుకును తండ్రి గొడ్డలితో నరికిచంపాడు. మండలంలోని ముల్కనూర్ గ్రామానికి చెందిన మాచర్ల కుమారస్వామి గౌడ్(53), శ్రీకాంత్ (32) తండ్రీ కొడుకులు. ఆదివారం రాత్రి కుటుంబకలహాలతో తండ్రి కుమారస్వామితో గొడవ పడ్డాడు. తండ్రి నచ్చ చెప్పి మంచిగా భార్య పిల్లల ను సాదుకావాలని, నీ ప్రవర్తన మార్చుకోవాలని చెప్పినా వినకుండా గొడవపడడం పడడమే కాకుండా తండ్రిపై గొడలితో దాడికి యత్నించాడు. ఈ క్రమంలో కుమారస్వామి కొడుకుపై ప్రతి దాడిచేయగా.. శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments