హస్తం గూటికి మేయర్ గుండు సుధారాణి..!
సీఎం ను కలిసిన మేయర్..
స్పాట్ వాయిస్, వరంగల్ : గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కుడా హస్తగతం కానుంది. ఇప్పటికే ఏడుగురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రె స్ లో చేరారు. మంత్రి కొండా సురేఖ దంపతుల నేతృత్వంలో 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు హైదరాబాద్‌కు వెళ్లారు. ఇక గుండు సుధారాణి హస్తం గూటికి వెళ్తారని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి సైతం ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలువడం.. ఆ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే మేయర్ మాత్రం.. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసినట్లు చెబుతున్నారు. మొత్తంగానైతే . రెండుమూడు రోజుల్లో మేయర్‌తో పాటు.. 18 నుంచి 20 మంది కార్పొరేటర్లు గులాబీ పార్టీకి రాజీనామా చేసి హస్తం నీడకు చేరనున్నారని సమాచారం.
Recent Comments