గురుకుల ఫలితాలలో సత్తా చాటిన అక్షర
అభినందించిన పాఠశాల యాజమాన్యం
స్పాట్ వాయిస్, కాశిబుగ్గ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాలలో గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన బావండ్లపల్లి అక్షర రాష్ట్రస్థాయిలో 2,620 ర్యాంకు సాధించింది. గత ఫిబ్రవరి 23న జరిగిన గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 86,667 మంది హాజరు కాగా శనివారం ప్రకటించిన ఫలితాలలో అక్షర రాష్ట్ర స్థాయిలో 2620 ర్యాంకు సాధించడం విశేషం. ఈ సందర్భంగా అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన అక్షరను, ఆమె తల్లిదండ్రులు బావండ్లపల్లి మంజుల, కిరణ్ కుమార్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోడం వనజలత, ఉపాధ్యాయులు భద్రు నాయక్, ప్రవీణ, ఎన్టీఆర్ నగర్ కాలనీవాసులు ప్రత్యేకంగా అభినందనించారు.
గురుకుల ఫలితాలలో సత్తా చాటిన అక్షర
RELATED ARTICLES
Recent Comments