స్పాట్ వాయిస్, ఖానాపూర్: మండలంలోని నాజీ తండా, బోటిమీది తండాల్లో పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గుడుంబా తయారీకి ఉపయోగించే 2500 లీటర్ల బెల్లం పానకాన్ని పారాబోశారు. అనంతరం గ్రామంలోని ప్రజలతో వారు మాట్లాడుతూ.. గుడుంబా తయారుచేసినా.. అమ్మినా చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. గంజాయి, గుట్కా వంటి నిషేధిత పదార్థాలపై అవగాహన కల్పించారు.
Recent Comments