ఎల్కతుర్తి ఎంపీపీ మేకల స్వప్న
స్పాట్ వాయిస్, ఎల్కతుర్తి: రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు, పాల ఉత్పత్తుల పైన పన్ను విధించడం వల్ల వారికి నష్టం జరుగుతుందని, నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎల్కతుర్తి ఎంపీపీ మేకల స్వప్న కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆదేశాలతో బుధవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోడిశాల సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో ఎంపీపీ మేకలు స్వప్న పాల్గొని మాట్లాడారు. పేద ,బడుగు, బలహీన వర్గాల నడ్డివిరిచేలా కేంద్ర ప్రభుత్వం సామాన్యుడు వాడే అన్ని వస్తువులపై జీఎస్టీ విధిస్తూ పేద, మధ్య తరగతి కుటుంబాల బతుకే భారంగా మారుస్తుందని ఎద్దేవా చేశారు. నాయకులతో కలిసి ఎల్కతుర్తిలోని కరీంనగర్-హన్మకొండ హైవే పై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పాలు, పాల ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి జీఎస్టీ పన్ను విధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తంగేడు నగేష్, ఎల్తూరి స్వామి, కడారి రాజు, జంగం రాజు, గొడిశాల వినయ్ కుమార్, సాతూరి శంకర్,కోరే రాజకుమార్, చిట్టి గౌడ్,అఖిల్ , భద్రయ్య, పవన్ , నాగరాజ్, శ్రీకాంత్, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పాలపై జీఎస్టీని వెనక్కి తీసుకోవాలి
RELATED ARTICLES
Recent Comments