Monday, November 25, 2024
Homeకెరీర్గ్రూప్ -1 అభ్యర్థులు... ఇవి తెలుసుకోండి..

గ్రూప్ -1 అభ్యర్థులు… ఇవి తెలుసుకోండి..

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: గ్రూప్-1 కొలువు భర్తీ కోసం తెలంగాణ రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీగా అడుగులు వేస్తోంది. 503 కొలువుల కోసం నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 33 కేంద్రాలు కేటాయించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఏవైనా 12 కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ఏదో ఒక కేంద్రాన్ని బోర్డు అభ్యర్థులకు కేటాయిస్తుంది. మెయిన్స్‌ పరీక్షను మాత్రం హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

* మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ
* దరఖాస్తు ఫీజు రూ.200
* రిజర్వేషన్‌ అభ్యర్థులకు రూ.120
* వయో పరిమితి కటాఫ్‌ డేట్ 01-07-2022
* ఓటీఆర్‌ నమోదు చేసుకోని వారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు.
* ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు గ్రూప్‌-1 పరీక్షలు రాయాలంటే తమ శాఖాధికారి నుంచి ఎన్‌వోసీ తీసుకుని బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది.
* ప్రిలిమినరీ పరీక్ష ముగిసిన వెంటనే ప్రశ్న పత్రాలకు సంబంధించిన కీ విడుదల చేస్తారు.
* కీ పై అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్‌ కీ తో పాటు అభ్యర్థుల జవాబు పత్రాలను వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు.
* ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణులైన వారు మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు.
* మెయిన్స్‌లో ఏ ఒక్క పేపర్‌ రాయకపోయినా అభ్యర్థులు అనర్హులే.

RELATED ARTICLES

Most Popular

Recent Comments